ఇకపై ఈ ఎయిర్ పోర్టు పేరు ‘జగద్గురు సంత్ తుకారాం’…
మహారాష్ట్ర అసెంబ్లీ పుణె ఎయిర్ పోర్టు పేరు మారుస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. పుణె లోని ‘లోహెగావ్ ఎయిర్ పోర్టు’గా ఉన్న ఈ ఎయిర్ పోర్టు పేరును ఇకపై ‘జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు’గా మార్చడానికి అంగీకరించారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖకు ఈ తీర్మానాన్ని పంపించనున్నారు.
భక్త తుకారాం మహారాష్ట్రలోని డెహూ గ్రామంలో జన్మించారు. ఆయన పండరీపురంలోని విఠోబా ( పాండురంగస్వామి)కి అగ్రగణ్యుడైన భక్తుడు.

