Home Page SliderNationalPolitics

‘ద్రోణుడి లాగే దేశ యువత బొటనవేలును కత్తిరిస్తున్నారు’.. రాహుల్ గాంధీ

లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చలో భాగంగా ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. “మహాభారతంలో ద్రోణుడు ఏకలవ్యుని బొటనవేలును గురుదక్షిణగా అడిగినట్లే, మీరు కూడా దేశ యువత బొటనవేలును కత్తిరిస్తున్నారు. దేశానికి బొటనవేలి వంటి ధారావి, పోర్టులు, ఎయిర్ పోర్టులు, డిఫెన్స్ పోర్టులు అదానీకి, అంబానీకి అప్పగిస్తున్నారు. రాజ్యాంగం అనేది అనేకమంది మేధావుల ఆలోచనలకు ప్రతిరూపం.  రాజ్యాగంలో అంబేద్కర్, గాంధీ, నెహ్రూల ఆకాంక్షలు, ఆలోచనలు మనకు కనిపిస్తాయి. సావర్కర్ సిద్ధాంతాలన్నీ తప్పే. అతని గురించి ప్రస్తావిస్తే నన్ను దోషిగా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జమిలి ఎన్నికలకు వ్యతిరేకం. సమాఖ్య నిర్మాణాన్ని తీసివేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమే ఈ జమిలి ఎన్నికలు” అన్నారు.