అల్లు అర్జున్‌కి మధ్యంతర బెయిల్
సంధ్య ధియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి రిమాండ్ విధిస్తే…హైకోర్టు మాత్రం అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.దాదాపు గంటన్నర పాటు సాగిన వాదోపవాదనల నేపథ్యంలో కోర్టు ఈ తీర్పు వెలువరిచింది.అయితే పీపి.జీపిలు మాత్రం బన్నీకి బెయిల్ ఇవ్వొద్దంటూ బలంగా వాదించారు.మరో వైపు మృతురాలి భర్త కూడా సోషల్ మీడియా వేదికగా తాను బన్నీపై కేసు పెట్టలేదని ప్రకటించారు.దీంతో పోలీసులు ఇరుకున పడినట్లైంది. ఇంకో వైపు చిక్కడపల్లి పోలీసులు… బన్నీని చంచల్ గూడ జైలుకి దాకా తీసుకెళ్లి తిరిగి వెనక్కు తీసుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.శుక్రవారం దాదాపు 6 గంటల పాటు జరిగిన ఉత్కంఠ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ జైలు ముఖం దాకా వెళ్లి వెనక్కు రావడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

