షిండేకు హోంశాఖ కావాలి..శివసేన డిమాండ్
మహారాష్ట్ర ప్రభుత్వంలో తమకు కీలకమైన హోంశాఖ కావాలని శివసేన పట్టుపడుతోంది. తమ పార్టీ నాయకుడు షిండేకు హోంశాఖ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని శిండేకు సన్నిహితుడిగా ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యే భరత్ పేర్కొన్నారు. గతంలో సీఎంగా షిండే ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ అప్పగించారు. అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న షిండేకు హోం శాఖ ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో శిండే నేతృత్వంలోని మునుపటి ప్రభుత్వంలో ఎన్సీపీ పార్టీకి ఆర్థిక శాఖ, బీజేపీకి హోంశాఖ ఉన్నాయి. అందుకే బీజేపీ మళ్లీ హోం శాఖను నిలబెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. అందుకే శివసేనకు పట్టణాభివృద్ధి, రెవెన్యూ శాఖలు దక్కవచ్చని సమాచారం.

