విజయ్ దేవరకొండ కుటుంబంతో ‘పుష్ప- 2’ సినిమాకెళ్లిన రష్మిక
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక డేటింగ్లో ఉన్నారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి రష్మిక తాను నటించిన ‘పుష్ప-2’ చిత్రాన్ని విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి ఏఎంబీ థియేటర్లో వీక్షించడం ఆసక్తిగా మారింది. విజయ్ తమ్ముడు ఆనంద్, విజయ్ తల్లితో కలిసి రష్మిక ఈ థియేటర్‌కి రావడం కెమెరాల కంట పడింది. దీనితో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకుముందు ప్రీమియర్ షోలో అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి కూడా రష్మిక ‘పుష్ప -2’ చిత్రాన్ని ఎంజాయ్ చేశారు. అయితే గతంలో ఏ చిత్రమూ సాధించని రికార్డును సాధించింది పుష్ప 2. ఒక గంటలోనే లక్ష టికెట్స్ అమ్ముడు పోయి బుక్ మై షోలో చరిత్ర సృష్టించింది.

