విద్యార్ధులున్న బస్సులో మంటలు
విద్యార్ధులు ప్రయాణిస్తున్న కాలేజి బస్సుకు మంటలు అంటుకున్నాయి. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్ధులు ప్రయాణిస్తున్నారు.అయితే మంటలు చెలరేగుతున్న సమయంలోనే డ్రైవర్ అప్రమత్తమై అందరిని బస్సు నుంచి కిందకు దించేశాడు.దీంతో విద్యార్ధులంతా సురక్షితంగా బయటపడ్డారు. రేపల్లె నుంచి గుంటూరుకు పరీక్షల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

