ఎంఈవో నుంచి ఫుడ్ ఏజన్సీ వరకు అంతా సస్పెండ్
విషాహారం తిని విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన ఘటనలో సంబంధిత అధికారులపై వేటు పడింది. హైద్రాబాద్ నారాయణపేట మగనూర్ జెడ్పీహెచ్ ఎస్ లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో ఎంఈవో నుంచి ఫుడ్ ఏజన్సీ వరకు అందరూ సస్పెండ్ అయ్యారు. మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులు, భోజనం పథకం నిర్వాహకులు …ఇలా ఎవరైతే దీనికి సంబంధించిన బాధ్యులున్నారో వారందరిపైనా తెలంగాణ ప్రభుత్వం వేటు వేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉత్వర్వులు జారీ చేశారు.గురువారం కలెక్టర్ … హాస్టల్,స్కూల్ ని సందర్శించారు.అనంతరం చికిత్స పొందుతున్న విద్యార్ధులను పరామర్శించి ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే అందరినీ టెర్మినేట్ చేస్తామని హెచ్చరించారు.
BREAKING NEWS: బీజేపీ కార్యకర్తపై దుండగుల అటాక్