Home Page SliderNewstelangana,

తమ స్కూల్ కోసం పిల్లలు ఏం చేశారంటే?

తాము చదువుకునే బడినే గుడిగా భావించారు ఆ పిల్లలు. తమ స్కూల్ కోసం తాము చేయగలిగిన పనులు చేస్తామని ఆందోళన మొదలుపెట్టారు. మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలంలోని బండ్లగూడలోని ఒక ప్రభుత్వ పాఠశాలకు ఉన్న ఎకరం స్థలం కబ్జా బారిన పడడం తట్టుకోలేక పోయారు విద్యార్థులు. గతంలోనే అది సర్కారు వారి స్థలమని హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా, కబ్జా దారులు తమ పట్టు విడవలేదు. దసరా సెలవుల సమయంలో తప్పుడు సర్వే నెంబరుతో తమ హస్తగతం చేసుకోవాలని ప్లాన్ వేశారు. స్కూల్ ప్రహారీ గోడను కూలగొట్టి, చెట్లు కొట్టేశారు. దీనితో పిల్లలు, టీచర్లు, తల్లిదండ్రులు అందరూ కలిసికట్టుగా ఈ కబ్జాను ఎదుర్కొంటున్నారు. ఎంఆర్వో కూడా దిగొచ్చి ఈ స్థలం స్కూలుకు సంబంధించినదే అంటూ వాగ్మూలం ఇచ్చారు. ఇక సర్కారు పక్కా పాఠశాల బిల్డింగు కట్టడమే తరువాయి.