Home Page SliderTelangana

పోలీస్ స్టేషన్ లో బీజేపీ ఎంపీ హంగామా

బీజేపీ కార్యకర్తలను విచారణకు పిలిచి అరెస్ట్ చేసినందుకు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి పోలీసులపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని సార్లపల్లిలో అసైన్డ్ భూమిలో చర్చి ఏర్పాటు విషయంలో నిర్మాణదారులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వివాదం నెలకొంది. దీంతో విచారణ నిమిత్తం బీజేపీ కార్యకర్తలను ఠాణాకు పిలిపించిన పోలీసులు తదనంతరం రిమాండ్ చేయాలని యత్నించారు. విషయం తెలుసుకున్న ఎంపీ రఘునందన్ రావు సోమవారం అర్ధరాత్రి పీఎస్ కు చేరుకుని ఏసీపీతో ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీ కార్యకర్తలు ఏమైనా ఉగ్రవాదులా..? నాన్ బెయిలబుల్ కేసులు ఎలా నమోదు చేస్తారని మండిపడ్డారు. దీంతో డీసీపీ మల్లారెడ్డి స్పందించి ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎంపీ రఘునందన్ శాంతించి స్టేషన్ నుంచి వెళ్లిపోయారు.