సల్మాన్ పై ఐశ్వర్య షాకింగ్ కామెంట్
మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో కొంతకాలం ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె షాకింగ్ కామెంట్లు చేశారు. సల్మాన్ ప్రేమలో ఉన్నప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నట్టు ఐశ్వర్య తెలిపారు. ఆ రోజులు తన జీవితంలో చీకటి రోజులుగా అభివర్ణించారు. ఆ హీరో తనను శారీరకంగా, మానసికంగా హింసించినట్టు చెప్పారు. అందుకే ఆయనతో విడిపోవాల్సి వచ్చిందని వివరించారు.