Home Page SliderNational

FDC మందులు నిషేధం

రెండు అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషధ పదార్థాలను కలిపి వాడే ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందులు వాడడం వల్ల రోగికి ప్రమాదం కలుగుతుందని కేంద్రప్రభుత్వం పేర్కొంది ఈ కారణంగా 156 రకాల ఔషధాలను నిషేధించింది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు ఉన్నాయని వాటిని వాడడం వల్ల ప్రమాదం ఉండదని పేర్కొంది. ఈ మందులలో జ్వరం, జలుబు, ఎలర్జీ, ఒళ్లు నొప్పులకు వాడై అనేక రాకల మందులు ఉన్నాయి. ఇవే కాక కాంబినేషన్ డ్రగ్స్ లేదా కాక్‌టెయిల్ డ్రగ్స్ అనే మందులను కూడా నిషేధిత మందుల జాబితాలో చేర్చింది. ఎసెక్లెఫెనాక్ 500 ఎంజీ, పారాసెటమల్ ఇంజెక్షన్, సెట్రిజెన్ హెచ్‌సీఎల్‌తో కూడిన పారాసిటెమల్, ఫినైలెప్రైన్ హెచ్‌సీఎల్‌తో కూడిన పారాసెటమల్ వంటివి కూడా ఈ నిషేధించారు. ఇలాంటి మందులు అమ్మడానికి వీల్లేదని సురక్షిత మందులనే ఇవ్వాలని ఫార్మా కంపెనీలను ఆదేశించింది కేంద్రం.