Home Page SliderInternational

‘యుద్ధం సమస్యకు పరిష్కారం కాదు’…పోలండ్‌లో మోదీ

రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలండ్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాలు అందరికీ ఆందోళనలు కలిగిస్తున్నాయని, యుద్ధక్షేత్రంలో సమస్యలకు పరిష్కారం దొరకదని భారత్ విశ్వాసమని పేర్కొన్నారు. సామాన్యుల ప్రాణాలు కోల్పోవడం మానవాళికి సవాల్ వంటిదన్నారు. చర్చలు, రాయబారంతో శాంతి, స్థిరత్వం ఏర్పాటవడాన్ని భారత్ స్వాగతిస్తుందన్నారు. ఈ సందర్భంగా పోలండ్‌తో భారత సంబంధాలపై చర్చించారు. రష్యా దండయాత్ర సమయంలో భారత విద్యార్థుల తరలింపుకు పోలండ్ చాలా సహకరించిందని పేర్కొన్నారు. పోలండ్ ప్రధాని టస్క్ 45 ఏళ్ల అనంతరం వార్సాలో భారత ప్రధానిని చూడడం చాలా సంతోషంగా ఉందని ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ భేటీ భారత్-పోలండ్ భాగస్వామ్యంలో సరికొత్త మైలురాయిగా భారత విదేశాంగ ప్రతినిధి పేర్కొన్నారు.