Home Page SliderInternational

పెళ్లి కాకుండానే వంద మందికి జన్మనిచ్చిన టెలిగ్రామ్ CEO పావెల్ దురోవ్.. అసలు మ్యాటరేంటంటే?

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పావెల్ దురోవ్ ఇటీవల తనకు “100 మందికి పైగా జీవసంబంధమైన పిల్లలు” ఉన్నారని వెల్లడించాడు. ఈ విషయాన్ని తన మేసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ద్వారా ప్రపంచానికి వెల్లడించాడు. 5.7 మిలియన్ సబ్‌స్క్రైబర్లున్న మెసేజింగ్ యాప్‌‌లో ఈ విషయాన్ని షేర్ చేశాడు. “నాకు 100 మందికి పైగా జీవసంబంధమైన పిల్లలు ఉన్నారని తెలిసింది. ఎన్నడూ వివాహం చేసుకోని, ఒంటరిగా జీవించడానికి ఇష్టపడే వ్యక్తికి ఇది ఎలా సాధ్యమవుతుంది?” అని చాలా మందికి అనుమానం కలగడం సహజమేనన్నాడు. సుమారు 15 సంవత్సరాల క్రితం, ఒక స్నేహితుడు “విచిత్రమైన అభ్యర్థన”తో తనను సంప్రదించాడన్నాడు. దంపతులిద్దరు సంతానోత్పత్తి సమస్య కారణంగా పిల్లలు పుట్టలేకపోయారని, బిడ్డ పుట్టడం కోసం ఒక క్లినిక్‌లో స్పెర్మ్‌ను దానం చేయాలని కోరారని చెప్పాడు. “హై-క్వాలిటీ డోనర్ మెటీరియల్” కొరత ఉందని క్లినిక్ బాస్ తనతో చెప్పాడని దురోవ్ చెప్పాడు. తనలాంటి వ్యక్తులు అజ్ఞాతంగా ఎక్కువ మంది జంటలకు సహాయం చేయడానికి ఎక్కువ స్పెర్మ్‌ను దానం చేయడం బాధ్యత అని డాక్టర్ వివరించాడని చెప్పుకొచ్చాడు.

“వీర్యకణ విరాళం కోసం సైన్ అప్ చేయడానికి ఇది నాకు పిచ్చిగా అనిపించింది. 2024 వరకు, నా గత విరాళాలతో 12 దేశాలలో వంద మందికి పైగా జంటలకు పిల్లలను కనేందుకు సహాయపడింది. అంతేకాకుండా, నేను స్పెర్మ్ దానం చేయడం ఆగిపోయిన చాలా సంవత్సరాల తర్వాత కూడా, ఒక IVF క్లినిక్ ఇప్పటికీ పిల్లలను కలిగి ఉండాలనుకునే జంట కోసం తన నుంచి సేకరించిన స్పెర్మ్‌ని కలిగి ఉందని చెప్పాడు.

మొత్తంగా తన స్పెర్మ్ ద్వారా జీవసంబంధమైన పిల్లలు ఒకరినొకరు కనుగొనేలా ఇప్పుడు తన DNAని ఓపెన్ సోర్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని పేర్కొన్నాడు. ఆరోగ్యకరమైన స్పెర్మ్ ప్రాముఖ్యతను చర్చిస్తూ, దురోవ్ తన విధిని నిర్వర్తించినందుకు గర్వపడుతున్నానని చెప్పాడు. వాస్తవానికి, ఇలా చేయడం ద్వారా అనేక ఇబ్బందులు, సమస్యలు, ప్రమాదాలు ఉన్నాయని, కానీ దాతగా ఉన్నందుకు చింతించనన్నాడు. ఆరోగ్యకరమైన స్పెర్మ్ కొరత ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రమైన సమస్యగా మారిందన్నాడు. దానిని తగ్గించడంలో తన వంతు సహాయం చేసినందుకు గర్విస్తున్నానన్నాడు. స్పెర్మ్ డొనేషన్ భావనపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేయడంలో సహాయం చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. మరింత ఆరోగ్యవంతమైన పురుషులను ఇలా ముందుకు రావడాన్ని తాను ప్రోత్సహించాలనుకుంటున్నట్టు చెప్పాడు. తద్వారా పిల్లలు కనడంలో కష్టపడుతున్న కుటుంబాలు మరిన్ని చాయిస్‌లు లభించగలవని చెప్పుకొచ్చాడు. దురోవ్ షేర్ చేసినప్పటి నుండి, పోస్ట్‌ను 1.8 మిలియన్ల మంది వీక్షించారు.