ఏపీలో పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం
ఏపీలో ఆగస్టు నెల ఫించన్ల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నెలలో కూడా గత నెల మాదిరిగానే సచివాలయ సిబ్బందితోనే ఫించన్ల పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సచివాలయ సిబ్బంది ఆగస్టు 1వ తేదిన ఉదయం 6 గంటలకు ఫించన్ల పంపిణీ ప్రారంభించాలని సెర్ప్ సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ రోజే 99శాతం ఫించన్ల పంపిణీని పూర్తి చేయాలని సీఈఓ సూచించారు. అయితే ఆ రోజు పలు కారణాలతో ఫించన్ పంపిణీ చేయలేని వారికి తర్వాతి రోజే ఫింఛన్ అందించాలన్నారు. ఈ మేరకు దీని గురించి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.ఈ నేపథ్యంలో సచివాలయ సిబ్బంది ఈ నెల 31నే బ్యాంక్ నుంచి నగదు తీసుకోవాలని సెర్ప్ సీఈఓ పేర్కొన్నారు.

