Home Page SliderNational

ఉద్యోగ నియామకాల విషయంలో కర్నాటక సర్కారు సంచలన నిర్ణయం


కర్నాటక క్యాబినెట్ మేనేజ్‌మెంట్ ఉద్యోగాలలో స్థానికులకు 50%, నాన్-మేనేజ్‌మెంట్ కేటగిరీలలో 75% రిజర్వేషన్‌లను సిద్ధరామయ్య సర్కారు ఆమోదించింది. ఈ బిల్లు ఐటీతో సహా అన్ని ప్రైవేట్ రంగాలకు వర్తిస్తుంది. బిల్లును ఉల్లంఘిస్తే సదరు కంపెనీలకు రూ.25,000 వరకు జరిమానా విధిస్తారు. గ్రూప్ ‘సి’, ‘డి’ ఉద్యోగాలకు కన్నడిగులను నియమించుకోవడానికి ప్రాధాన్యతనిచ్చేలా ప్రైవేట్ పరిశ్రమలను తప్పనిసరి చేస్తూ చట్టానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతకు ముందు పరిశ్రమలు, కర్మాగారాలు, ఇతర సంస్థలలో స్థానిక అభ్యర్థులకు కర్నాటక రాష్ట్ర ఉపాధి బిల్లు ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టినుంది.