Home Page SliderTelangana

గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో తండ్రీ కొడుకు ఉత్తీర్ణులైరి

కామేపల్లి: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో తండ్రీ, కొడుకు అర్హత సాధించారు. దాసరి రవికిరణ్ ముచ్చర్ల – జాస్తిపల్లి ఉన్నత స్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. కొడుకు మైకేల్ ఇమ్మానియేలు (25) దూర్యవిద్యలో డిగ్రీ పూర్తి చేశారు. 53 ఏళ్ల వయసులో రవికిరణ్ తనయుడికి సూచనలు ఇవ్వడంతోపాటు తానూ పరీక్ష రాశారు. రిజర్వేషన్, ఇన్ సర్వీసు కోటాలో వయో పరిమితి ఎగ్జంప్షన్ ఉండడంతో పరీక్ష రాసినట్టు, ఎప్పటి నుండో ఉన్న తన కోరికను తీర్చుకున్నట్టు చెప్పారు.