Home Page SliderTelangana

నాలుగేళ్ల సర్వీసుంటే దంపతులకూ ట్రాన్స్‌ఫర్‌

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై జారీచేసిన ఉత్తర్వుల్లోని సందేహాలపై ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టతనిచ్చాయి. గతంలో అమలైన విధానమే వర్తిస్తుందని పేర్కొన్నాయి. దీని ప్రకారం ఒకేచోట నాలుగేళ్ల నుండి పనిచేసిన వారందరినీ కచ్చితంగా బదిలీ చేయాల్సి ఉంటుందని వివరించాయి. వీరిలో భార్యాభర్తలున్నా తప్పనిసరిగా స్థానచలనం కలిగించాల్సి ఉంటుందని, అలా మార్చినప్పుడు కొత్త ప్రాంతాల్లో దగ్గరగా ఉండేలా వారికి పోస్టింగులు ఉండాలని పేర్కొన్నాయి.