చంద్రబాబుతో పోటీపడే అవకాశం వచ్చింది: ముఖ్యమంత్రి రేవంత్
తెలంగాణ: మనకు గుర్తింపు రావాలంటే సమర్థుడైన ఆటగాడితో పోటీపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పోటీపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు నడిపే అవకాశం నాకు వచ్చింది. గతంలో నేను 12 గంటలే పనిచేస్తే చాలనుకునేవాడిని. కానీ ఇప్పుడు మనం కూడా చంద్రబాబులా 18 గంటలు పనిచేస్తూ ఆయనతో పోటీ పడదామని అధికారులు, సహచరులతో చెప్పాను అని బసవతారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో రేవంత్ రెడ్డి అన్నారు.

