కాంగ్రెస్‌లో మాజీ మంత్రి పోచారం, ఆందోళనకు దిగిన మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త రాజకీయ వ్యూహాలతో అడుగులు వేస్తున్నారు. మాజీ మంత్రి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇంటికి వెళ్లి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు కుమారుడికి కాంగ్రెస్ కండువా కప్పారు. పోచారం రైతుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని, ఆయన సూచనలు, సలహాలు తాము పాటిస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారు.

ఇదే సమయంలో పోచారం ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోచారం ఇంటి ముందు బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ ఉన్న సమయంలో బాల్క సుమన్ రావడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అలజడి నెలకొంది.
దీంతో పోచారం నివాసానికి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బాల్కసుమన్, బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోచారం నివాసంలోకి బాల్కసుమన్ ఎలా వచ్చారన్నదానిపై డీసీపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోచారం నివాసానికి ఈ సందర్భంగా సీఎం సెక్యురిటీ ఆఫీసర్ చక్రవర్తి గుమ్మి వచ్చారు.