Home Page SliderTelangana

గజ్వేల్: వర్గల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల

గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.

గజ్వేల్‌లో మీరు ఇచ్చే తీర్పు తెలంగాణ ఆత్మగౌరవం పెరిగేలా ఉండాలి. నా దగ్గర ధైర్యలక్ష్మి మాత్రమే ఉంది. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి లేదు. బంగారు తెలంగాణలో ఏ కుటుంబం బాగుపడింది, ఒక్క మీ కుటుంబం తప్ప. కేసీఆర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయ్యారు.

******

నేను కూడా వర్గల్‌లో ఇల్లుకట్టుకుని ఉన్న. పౌల్ట్రీ నడిపిన. ఇక్కడి నాయకులే నన్ను ములుగు ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌లో టీఆర్‌ఎల్‌లో చేర్పించారు. సంవత్సరంన్నర ఇక్కడ TRSలో పనిచేసిన తరువాత కమలాపూర్‌కి వెళ్ళిన. 20 ఏళ్లు కేసీఆర్ అడుగులో అడుగు వేసిన నన్ను వెళ్లగొట్టాడు.. రాజీనామా చేయమని సవాలు చేస్తే రోషం ఉన్న బిడ్డను కాబట్టి రాజీనామా చేసిన. ఆ తరువాత హుజూరాబాద్‌లో ఏం జరిగిందో మీరందరూ చూశారు.

ప్రజాస్వామ్యాన్ని చెరబడుతున్నావు కాబట్టి బ్రతికించుకునే కర్తవ్యం ఉందని నీ మీద గజ్వేల్‌లో పోటీచేస్తానని సవాలు చేసి వస్తే కేసీఆర్ పారిపోయిండు. నువ్వు నిజంగా సేవ చేస్తే గజ్వేల్ ప్రజల మీద నీకు ఎందుకు నమ్మకం లేదు. 10 ఏళ్లల్లో ఎన్నిసార్లు ఈ ప్రజలను కలిశావు. వర్గల్‌లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్‌లు కట్టారు? కొత్తగా ఎన్ని తెల్లరేషన్ కార్డులు ఇచ్చావు? ఇచ్చావా నిరుద్యోగ భృతి? నోటిఫికేషన్ల కోసం వేచి చూసి చూసి విసిగిపోయారు.

17 పేపర్లు లీకు చేసి చదువుకున్న వారికి కాదు పైరవీకారులకు నౌకరీలు వస్తాయని చెప్పారు. పాలనకు అనర్హులు మీరు. ప్రవళ్లిక, ముత్యాల శంకర్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు. మాట ఇస్తే తలనరుక్కుంట అని చెప్పే కేసీఆర్ ఎందుకు రైతు రుణమాఫీ చెయ్యలేదు. డబ్బులు లేకనా? మనసు లేకనా? మందుసీసా అమ్ముకోకపోతే జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేవు కేసీఆర్. కేసీఆర్ చేసిన అప్పుతో పుట్టబోయేబిడ్డ మీద లక్షన్నర అప్పు ఉంది.

మహిళలను లక్షాధికారులు చేస్తా అని రూ.4,200 కోట్ల బకాయిలు చెల్లించకుండా వారిని కూడా మోసం చేశారు. బీజేపీని మీరు ఆశీర్వదిస్తే.. తెలంగాణలో ఏ పేద కుటుంబపెద్ద చనిపోయినా రూ.5 లక్షల భీమా అందిస్తాం. వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ అందిస్తాం. ఇద్దరు ముసలివాళ్లకు పెన్షన్ ఇస్తాం. డబుల్ బెడ్ రూమ్ కట్టించే జిమ్మేదార్ మాది. ఉచిత విద్యా, వైద్యం అందిస్తాం. రేషన్ కార్డులు అందిస్తాం. నాకు ఎమ్మెల్యే, మంత్రి పదవి కొత్త కాదు. పదవి కోసం కాదు ఇవన్నీ అందించేందుకు మాకు అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. కేసీఆర్‌ను ఎమ్మెల్యే చేసినందుకు భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయ్యారు. రైతులు అడ్డా కూలీలుగా మారారు.

కుటుంబాలు మల మల మాడుతున్నాయి. బంగారు తెలంగాణలో ఏ కుటుంబం బాగుపడింది, ఒక్క మీ కుటుంబం తప్ప. నా దగ్గర ధైర్యలక్ష్మి మాత్రమే ఉంది. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి లేదు. కేసీఆర్ డబ్బులు ఇస్తారు తీసుకోండి,  ప్రమాణం చేయమంటే లోపల ధర్మం కోసం ప్రమాణం చెయ్యు, పైపైకి వాళ్ళు చెప్పినట్టు ప్రచారం చేయండి. ఓటు మాత్రం కమలం పువ్వు గుర్తుకు వేయండి. గజ్వేల్‌లో మీరు ఇచ్చే తీర్పు తెలంగాణ ఆత్మగౌరవం పెరిగేలా ఉండాలి.