ప్రజా విజయభేరి మోగించే సమయం ఆసన్నమైంది: రాఘవేంద్రరావు, అశ్వనీదత్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటనకు ప్రముఖ దర్శక, నిర్మాతలు రాఘవేంద్రరావు, అశ్వినీదత్ సంఘీభావం తెలిపారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి
నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటనకు ప్రముఖ దర్శక నిర్మాతలు రాఘవేంద్రరావు, అశ్వినీదత్ సంఘీభావం తెలిపారు. తమ సోదరి చేపట్టిన యాత్రకు లభిస్తున్న గొప్ప స్పందన చూస్తుంటే నిజంగానే నిజం గెలుస్తుందనే నమ్మకం ఉందన్నారు. నిజం గెలిచి ప్రజా విజయభేరి మోగించే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. చంద్రబాబు అరెస్టుపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న వ్యతిరేక జ్వాలలు.. ఈ అరాచక వైకాపా ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పీకెయ్యాలన్నారు. ఈ యాత్ర చంద్రబాబు రేపటి విజయానికి హృదయపూర్వక ఆహ్వాన పర్వం అంటూ ఓ ప్రకటన చేశారు.

