చంద్రబాబు భద్రత ఆందోళన కలిగిస్తోంది: భార్య భువనేశ్వరి
చంద్రబాబు నాయుడుకు భద్రతపై భయంగా ఉందని నారా భువనేశ్వరి అన్నారు. ఈరోజు సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడిన భువనేశ్వరి.. చంద్రబాబుకు ప్రజలు, వారి సంక్షేమం పట్ల ఎప్పుడూ శ్రద్ధ ఉంటుందని అన్నారు. చంద్రబాబును తప్పుడు కేసుల్లో ఇరికించి ఆయన నిర్మించిన సెంట్రల్ జైలు భవనంలో ఉంచడం దురదృష్టకరమన్నారు.


