Home Page SliderNational

హర్యానాలో మళ్లీ హైటెన్షన్…ఏడుగురు మృతి

హర్యానాలోని నుహ్‌లో మళ్లీ ఆందోళనకారులు విజృంభించారు. దీనితో హైటెన్షన్ నెలకొంది. ఇక్కడ చెలరేగిన హింసాకాండలో ఏడుగురు మృతి చెందారు. 60 మందికి గాయాలయ్యాయి. దీనితో సుప్రీంకోర్టు కూడా అలెర్టయ్యింది. అక్కడ పరిస్థితి సమీక్షిస్తూ ఉండాలని, ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదని హర్యానా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ అక్కడ 26ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. నుహ్, ఫరీదాబాద్, పాల్వాల్, జజ్జర్ జిల్లాలలో 144 సెక్షన్ అమలుచేస్తున్నారు. 14 టీమ్‌లకు చెందిన పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అదుపులో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. పాఠశాలలు, విద్యాసంస్థలకు మళ్లీ ప్రకటించే వరకు నిరవధిక సెలవులు మంజూరు చేశారు. కర్ఫ్యూను మధ్యాహ్నం మూడుగంటల నుండి 5 గంటల వరకు సడలిస్తున్నారు. అబద్దపు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే నుహ్ ఎస్పీ నరేంద్ర సింగ్ బిజర్నియా ప్రకటించారు. ఈ గొడవలు గుర్‌గ్రామ్‌కు కూడా వ్యాపించడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళనలపై విచారించడానికి ఒక సిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పోలీస్ చీఫ్ అగర్వాల్ వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ ఇంటర్నెట్, సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు తెలిపారు.