తనపై హత్యాయత్నం జరిగిందంటూ డిజిపిని కలిసిన కేఏ పాల్
తనపై హత్యకు ప్రయత్నించారంటూ తెలంగాణా డిజిపిని కలిసారు ప్రజాశాంతిపార్టీ స్థాపకుడు కేఏ పాల్. ఈ హత్యాయత్నంలో తెలంగాణ ప్రభుత్వోద్యోగులు, ఎమ్మెల్యేలు కూడా కిల్లర్ గ్యాంగ్‌తో కుమ్మక్కు అయ్యారంటూ ఆరోపించారు. ఆయనతో పాటు ప్రజాశాంతి పార్టీ లీడర్లు ఐఏఎస్ రోశయ్య, జ్యోతి బెగల్ కూడా ఆయనను కలిసి కంప్లైంటు ఇచ్చారు. సీఐ నవీన్ కుమార్ రెడ్డి, సదాశివ పేట ఎస్సై నాగలక్ష్మిలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వారిద్దరూ 30 మంది కిల్లర్ల ముఠాను తమపై దాడికి అనుమతించారని అభియోగం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట దగ్గరలో తమ ఛారిటీ ట్రస్ట్ వద్ద ఈ దాడులు జరిగాయని వారు ఫిర్యాదు చేశారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య, చిన్నయ్యలు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిలు కూడా వికృతంగా, రాక్షసంగా వ్రవర్తిస్తున్నారని తమ కంప్లైంటులో పేర్కొన్నారు. వారిపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.