ఫేస్‌బుక్ లైవ్‌లో విషం తాగిన ప్రముఖ నటుడు
బాలీవుడ్ నటుడు తీర్థానంద్ రావు ఆత్మహత్యాయత్నం చేశారు. కాగా తీర్థానంద్ రావు బాలీవుడ్ సూపర్ హిట్ షో “ది కపిల్ శర్మ షో”లో కనిపిస్తూ..ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ..మంచి కమెడియన్‌గా గుర్తింపు పొందారు. అయితే ఆయన తాజాగా ఫేస్‌బుక్ లైవ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన లైవ్‌లోనే విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కాగా ఓ మహిళ తనను బ్లాక్ మెయిల్ చేస్తూ..డబ్బులు ఇవ్వాలంటూ బెదిరిస్తుందని ఆయన తెలిపారు. దీనిపై ఆమె పోలీసులకు కూడా కంప్లైట్ ఇచ్చిందని ఆయన వాపోయారు. దీంతో భయానికి,మనస్థాపానికి గురైన తీర్థానంద్ రావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఇది చూసిన ఆయన స్నేహితులు హుటాహుటిన తీర్థానంద్ ఇంటికి వెళ్లారు. ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాగా తీర్థానంద్ గతంలో కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు సమాచారం.