తెలంగాణాలో ఆమె ఆకాశంలో సగం కాదు..ఆమే ఆకాశం: కేటీఆర్
ఈ రోజు తెలంగాణా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణా మహిళలకు దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి కేటీఆర్ ప్రత్యేకమైన ట్వీట్ చేశారు. ఆమె ఆకాశంలో సగం కాదు.. “ఆమే” ఆకాశం… సంక్షేమంలో సగం కాదు.. ”ఆమే” అగ్రభాగం… మహిళా సంక్షేమంలో.. మనతెలంగాణ రాష్ట్రం.. యావత్ దేశానికే ఆదర్శం.. అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి… ఆరు పదులు దాటిన అవ్వల వరకు… అందరినీ కేసీఆర్ సర్కార్ కంటికి రెప్పలా కాపాడుతోంది.తెలంగాణాలో గర్భిణీలకు ఇచ్చే న్యూట్రిషియన్ కిట్లు ఆరోగ్య తెలంగాణా నిర్మాణానికి తొలి అడుగు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మిదేవి పుట్టినట్లే అన్నారు. తెలంగాణాలో కేసీఆర్ కిట్‌తోపాటు అందే రూ.13000/- ప్రతి ఇల్లు ఎప్పటికీ మరవలేని మేలు అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

