పవన్ ,సాయితేజ్ కొత్త మూవీ టైటిల్ తెలుసా “బ్రో”
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్‌తో కలిసి PSDKT సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. అదేంటంటే ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం నిర్ణయించలేదు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ “బ్రో”గా నిర్ణయిస్తూ ..ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. కాగా ఈ పవర్ ప్యాక్ కాంబోకు సముద్రఖని దర్శకత్వం వహించగా..SS తమన్ సంగీతం సమకూర్చారు. ఈ ఫస్ట్ మోషన్ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. అంతేకాకుండా తమన్ మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేసినట్లు కన్పిస్తోంది. దీంతో “బ్రో” సినిమాపై అంచనాలు కూడా అమాంతం పెరిగాయి. అయితే ఈ మోషన్ పోస్టర్‌లో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ లుక్‌ను రివీల్ చేయలేదు. కాగా సాయిధరమ్ తేజ్ ఇటీవల విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. దీంతో ఆయన తన మేనమామ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటిస్తోన్న “బ్రో” సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

