Home Page SliderInternational

అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారిపోనుందా?

చివరకు అగ్రరాజ్యంగా విలసిల్లుతున్న అమెరికాను కూడా ఆర్థిక సంక్షోభం విడిచిపెట్టలేదు.  ప్రభుత్వం దివాలా దిశగా పయనం సాగిస్తోంది. రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య వైరం కారణంగా అప్పుల పరిమితిని పెంచుకునే అవకాశం అమెరికా కాంగ్రెస్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం డెమోక్రాట్ల చేతిలో ఉండడంతో, రిపబ్లికన్లు ఎక్కువగా ఉన్న ప్రతినిధుల సభలో వారు ప్రతీ అంశానికి ‘ఎడ్డెం అంటే తెడ్డెం’ అంటున్నారు. ఇప్పుడు అప్పుల పరిమితిని పెంచుకోకపోతే ప్రభుత్వ ఉద్యోగులు, సైన్యానికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. దీనితో 80 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆర్థికమంత్రి యెలెన్ ప్రకటించాడు. తానేమీ చేయలేనంటూ చేతులెత్తేశాడు.

అమెరికన్ కాంగ్రెస్ అప్పుల పరిమితిని పెంచితే ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ తగ్గిపోతుందని, ఖర్చులు తగ్గించుకోవాలని ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు వాదిస్తున్నారు. అమెరికా ప్రసిడెంట్ బైడెన్‌ వారితో చర్చిస్తున్నా వారు తగ్గడం లేదు. రుణ పరిమితిని పెంచే నిర్ణయం తీసుకోకుంటే జూన్ నుండి ఆగస్టు లోపు ఆర్థికమాంద్యానికి దారితీసే ప్రమాదం ఉంది. దీనితో డాలర్ విలువ క్షీణించి, చైనా కరెన్సీకి ఆధిపత్యం పెరిగే అవకాశాలున్నాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. వడ్డీరేట్లు పెరిగిపోతాయి. వీలైనంత త్వరలో అమెరికన్ కాంగ్రెస్‌ ఈ రుణపరిమితిని పెంచుకుంటే ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టవచ్చని ఆర్థికనిపుణులు సూచిస్తున్నారు.