జగన్ తాగే నీటి విలువ ప్రజలకిచ్చే పెన్షన్ల కన్నా ఎక్కువా?
టిడిపి నేత ఆనం వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని సాక్ష్యాలతో సహా నిరూపిస్తానన్నారు. జగన్ పేద సీఎంగా చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు. జగన్ త్రాగే వాటర్ బ్రాండ్ అశ్వ బాటిల్ విలువ కేవలం ఆరు వేల రూపాయలేనన్నారు. ఇది సీఎం జగన్ ప్రజలకు ఇచ్చే రెండువేల రూపాయల కంటే మూడురెట్లు ఎక్కువని ఎద్దేవా చేశారు. సాక్షిపేపర్ సర్క్యులేషన్ పెంచడానికి, ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు అందరూ తప్పకుండా కొనేలా చేసి, 3 లక్షల పేపర్ల సర్క్యులేషన్ పెంచారన్నారు. ప్రభుత్వ అడ్వటైజ్మెంట్లు 500 కోట్లు రూపాయలు సాక్షి పేపర్‌కు సంవత్సరానికి చెల్లిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వేసే శాండల్స్ ధర లక్షన్నర పై చిలుకేన్నారు. మన ముఖ్యమంత్రి 10 వతరగతి కూడా పాస్ కాలేదన్నారు. తర్వాత కాలంలో పదవతరగతి పాసయినట్లు రుజువులు కూడా చూపించలేదన్నారు.


 
							 
							