Home Page SliderTelangana

టెన్త్ పేపర్ లీకేజ్‌ వ్యవహారంలో ముగ్గురి సస్పెన్షన్

తాండూరులోని టెన్త్ పేపర్ లీకైనట్లు వచ్చిన వార్తలపై తెలంగాణా విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. క్వశ్చిన్ పేపర్ ఫొటోను తీసి  నిందితుడు ఇన్‌విజిలేటర్ బందప్ప ప్రైవేట్ స్కూల్ టీచర్‌కు పంపినట్లు సమాచారం. ఇన్‌విజిలేటర్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, స్కూల్ సూపరిండెంట్‌లపై సస్పెన్షన్ వేటు వేసింది విద్యాశాఖ. ఇదే పాఠశాలలో బందప్ప భార్య ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ బందప్పపై గతంలో కూడా కొన్ని కేసులున్నాయని పోలీసులు తెలియజేశారు. లీకైన పేపర్ ఆధారంగా చిట్‌లు తయారు చేయాలని ప్రయత్నించారు. కానీ పరీక్ష ముగిసేలోపు చిట్‌లు తయారుచేయలేకపోయారు. ఈ పేపర్ ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో తిరుగాడినట్లు గుర్తించారు. కానీ పరీక్ష రాసే విద్యార్థులందరూ పరీక్షకు హాజరయిన కొంత సేపటి తర్వాత పేపర్ లీకయ్యిందని, దీనితో విద్యార్థులకు ఈ పేపర్ సమాచారం అందలేదని విద్యాశాఖ సమాధానమిచ్చింది. దీనిని పేపర్ లీకేజ్‌గా పరిగణించవల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.