Home Page SliderNational

నాగాలాండ్‌లో ఖాతా తెరవని కాంగ్రెస్ పార్టీ

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. చిన్నా, చితక పార్టీలు భారీ విజయాలు సాధించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా అక్కడ గెలుచుకోలేకపోయింది. నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీ అక్కడ గణనీయమైన ఫలితాలను రాబట్టింది. 12 సీట్లలో విజయం సాధించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఎన్‌డీపీపీ అధినేత నీఫియు రియో అద్భుత విజయాన్ని అందుకున్నారు. 25 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించి సత్తా చాటింది. గత ఎన్నికల్లో పోటీ చేసి 18 స్థానాల్లో విజయం సాధించిన ఆ పార్టీ ఇప్పుడు అంతకు మించి విజయాన్ని అందుకొంది. గతంలో అద్భుత విజయాలు సాధించిన నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) ఈ సారి రెండు సీట్లకే పరిమితమైంది. ఎన్సీపీ ఏడు సీట్లలో విజయం సాధించడం విశేషం. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు. నాగాలాండ్ కాంగ్రెస్ పార్టీ 3.5 శాతం ఓట్లతో 40, 444 ఓట్లను పొందగలిగినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి ఒక్కరు కూడా విజయం సాధించలేకపోయారు.