Andhra PradeshHome Page SliderPolitics

రేపు ఢిల్లీకి సీఎం జగన్‌.. మోదీతో భేటీ

ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రేపు సాయంత్రం ఢిల్లీ టూర్‌కు వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను మోదీతో చర్చించనున్నారు. విభజన హామీలను అమలు చేయాలని మరోసారి కోరనున్నారు. రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో మోదీతో జగన్‌ భేటీ ఆసక్తికరంగా మారింది. మరోవైపు పలువురు కేంద్రమంత్రులను కూడా జగన్‌ భేటీకానున్నారు.