Andhra PradeshNews

పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి

పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలను వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి తీవ్రంగా ఖండించారు. పవన్ కల్యాణ్ అసలు రాజకీయ నాయకుడే కాదన్నారు. రాజకీయాలకు ఆయనకు సంబంధం లేదన్నారు. చంద్రబాబు ఎవరితోనైనా కలుస్తారు. సీఎం కావడమే చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదు కాబట్టే..చంద్రబాబు వెళ్లి పవన్‌ను కలిశారన్నారు. చంద్రబాబు పొత్తుల గురించి రాష్ట్రప్రజలందరికీ తెలుసన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా.. వైసీపీ ప్రభుత్వాన్ని ఏమి చేయలేరని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ ఏపీ ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో చేస్తున్న మేలును వారు ఎప్పటికీ మర్చిపోరని తెలిపారు. ఈ మేరకు రాబోయే ఎన్నికలలో కూడా భారీ మెజారిటీతో ఏపీలో వైసీపీ జెండా ఎగురవేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.