70ఏళ్లు ఆలయానికి కాపల ఉన్న ముసలి మృతి
కేరళలోని కసరగోడ్‌లోని శ్రీ అనంతపుర సరస్సు గుడికి కాపలాగా ఉన్న ముసలి ‘ బాబియా ‘ చనిపోయింది. దాదాపు 70 ఏళ్లుగా ఆలయంలోని సరస్సులో ఉంటూ అనంతపద్మనాభ స్వామి ప్రసాదాన్ని తింటూ నివసించేది. కేవలం శాఖహారం మాత్రమే తింటూ ఆలయంలోనికి వచ్చి వెళ్లే భక్తులకు ఎటువంటి హాని చేయకుండా ఉంటున్న బాబియా చనిపోవడంతో ఆలయ నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు. కాగా బాబియాకు శాస్ర్తోక్తంగా అంత్యక్రియలు జరిపి దానిపై తమకు ఉన్న ప్రేమను , బంధాన్ని వ్యక్తపరిచారు.