Andhra PradeshNews Alert

‘మనసానమః’ డైరెక్టరుకు సీఎం జగన్ ప్రశంసలు..

మనసానమః.. ఈ షార్ట్ ఫీల్మ్ యువ డైరెక్టర్ దీపక్ రెడ్డి ఏమంటూ ఈ పేరు పెట్టాడో గాని ప్రతి ఒక్కరి మనసుని దోచుకుంటుంది. అంతలా ఈ షార్ట్ ఫీల్మ్ ఏముంది అనుకుంటున్నారా. సూర్య అనే యువకుడు తన జీవితంలో జరిగిన మూడు ప్రేమ కథల్ని వివరిస్తుంటాడు, కానీ అది రివర్స్ పద్ధతిలో నేరేట్ చేస్తుంటాడు. ప్రతి ప్రేమకథ ముగింపు నుంచి మొదటికి వెళ్తుంటుంది. కాని డైరెక్టర్ దీపక్ రెడ్డి రివర్స్ స్క్రీన్‌ప్లే లవ్ స్టోరీగా తెరకెక్తించాడు. ఎక్కడా తడబడకుండా ప్రతి ఒక్కరికి అర్థమైయేలా చాలా అందంగా చూపించాడు. అందుకే ప్రేక్షకులు ఈ షార్ట్ ఫీల్మ్ గొప్ప విజయంగా మలిచారు. 2020 జనవరిలో యూట్యూబ్‌లో విడుదలైన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఏకంగా 900 పైగా అవార్డులు అందుకుని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అవార్డులు అందుకున్నషార్ట్ ఫీల్మ్‌గా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకుంది. గత ఏడాది ఆస్కార్ అవార్డు స్క్రీనింగ్ కూడా వెళ్ళింది.

ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన కొందరు తెలుగు సిసీ దర్శకులు కూడా డైరెక్టర్ దీపక్ రెడ్డి టాలెంట్‌ను మెచ్చుకున్నారు. మరో తమిళ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ కి ఈ షార్ట్ ఫిల్మ్ నచ్చడంతో తమిళం లో అనువదించి విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ షార్ట్ ఫిల్మ్‌ నచ్చడంతో డైరెక్టర్ దీపక్ రెడ్డిని పిలిచి అభినదించారు. ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు అందుకున్నందుకు దీపక్‌ను ప్రశంసించారు. భవిష్యత్తులో మంచి చిత్రాలు రూపోందించాలని మరెన్నో అవార్డులు అందుకోవాలంటూ సీఎం జగన్ ఆకాంక్షించారు.