అమెజాన్ – ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల జాతర
ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖ ఈ- కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ ఫ్రీడమ్ సేల్స్‌ను ప్రకటించాయి. ఎలక్ట్రానిక్స్ నుంచి గృహోపకరణాల వరకు పలు ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్’ సేల్ ఆగస్టు 7 నుంచి ప్రారంభం కానుండగా, ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందుగానే డీల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఎస్‌బీఐ బ్యాంక్ కార్డులతో కొనుగోళ్లు చేసే వారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో- కాస్ట్ ఈఎంఐ వంటి ప్రయోజనాలు కల్పించనుంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్ యాక్సెసరీలు, గృహోపకరణాలతో పాటు అమెజాన్ డివైజ్‌లపై ప్రత్యేక ఆఫర్లు ఉండనున్నాయి.
మరోవైపు ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానుంది. ప్లస్, బ్లాక్ సభ్యులకు 24 గంటల ముందే సేల్ యాక్సెస్ లభించనుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు, నో- కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, టాప్ డీల్స్‌ను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, టీవీలు తదితర ఉత్పత్తులపై భారీ రాయితీలు అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఫ్రీడమ్ సేల్స్‌తో వినియోగదారులకు తక్కువ ధరల్లో తమకు నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం లభించనుంది.

