Home Page SliderNationalNewsNews AlertPolitics

టీఎంసీ ఎంపీపై గుడ్ల దాడి

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి జరిగింది. బుధవారం ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కొందరు నిరసనకారులు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోడిగుడ్లు విసిరారు.

అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే మహువా మొయిత్రాను అక్కడి నుంచి సురక్షితంగా తరలించడంతో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన పోలీసుల సమక్షంలోనే జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

దాడిపై స్పందించిన మహువా మొయిత్రా, భారీ సంఖ్యలో నిరసనకారులు గుమిగూడినా పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమేనని విమర్శించారు.

దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు, వారి నిరసనకు కారణమేంటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ కేసు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. బెంగాల్‌లో ప్రజాప్రతినిధుల భద్రతపై మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.