Andhra PradeshBreaking NewsHome Page SliderNewsTrending Today

మావిగన్‌కు కట్టుబడి ఉన్నాం: జగన్

తాడేపల్లి: వచ్చే ఎన్నికలు ‘మావిగన్ వర్సెస్ అమరావతి’గా సాగుతాయని, అమరావతి అంటే చంద్రబాబు, మావిగన్ అంటే వైసీపీ అని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ‘రూల్ ఆఫ్ లా’ కాకుండా ‘రూల్ ఆఫ్ ఫియర్’ కొనసాగుతోందని, రెడ్‌బుక్ పాలన, లాకప్ మరణాలు, రైతుల సమస్యలు, భూసేకరణ వివాదాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రాజధాని ప్రాంత రైతులపై దాడులు చేసి, బాధితులపైనే కేసులు నమోదు చేశారని విమర్శించారు.

వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, పొగాకు, మామిడి, అక్వా రైతులకు ప్రభుత్వం అండగా నిలవడం లేదన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా యూరియా, సబ్సిడీ విత్తనాల కొరత తీవ్రంగా ఉందని ఆరోపించారు.

ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ పేరుతో పేదల ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని, దళిత క్రైస్తవుల రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. బీచ్ షాక్స్ పేరుతో కొత్త మద్యం సంస్కృతికి ప్రభుత్వం తెరలేపుతోందని విమర్శించారు.

తాను అమరావతికి వ్యతిరేకం కాదని, అక్కడ జరిగే అవినీతికే వ్యతిరేకమని స్పష్టం చేసిన జగన్, ‘మావిగన్’ అంశాన్ని వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాన్ని కాపాడాలని ప్రజలకు “హే రామ్.. సేవ్ ఆంధ్రా” అంటూ పిలుపునిచ్చారు.