News

వరంగల్ పై నల్గొండ విజయం

ఉప్పల్ వేదికగా జరిగిన టీ20 లీగ్ మ్యాచ్‌లో నల్గొండ నైట్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్‌పై నల్గొండ 91 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఓపెనర్లు గౌరవ్ రెడ్డి (81) , నితీశ్ రెడ్డి (81) హాఫ్ సెంచరీలతో జట్టుకు భారీ స్కోరును అందించారు. అలాగే కెప్టెన్ రాహుల్ బుద్ధి (31) , అర్ఫాజ్ అహ్మద్ (33) దూకుడుగా ఆడారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వరంగల్ వారియర్స్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. ఆ జట్టు 14 ఓవర్లలోనే 168 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అమన్ రావు (46), మురుగన్ అభిషేక్ (44) మినహా మిగిలిన ఆటగాళ్లంతా విఫలమయ్యారు.వరంగల్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో నల్గొండ బౌలర్లు కీలక పాత్ర పోషించారు. వరంగల్ బౌలర్లలో అబ్దుల్ మాలిక్ 2 వికెట్లు తీయగా, ముదాస్సర్ , శౌనక్ చెరో వికెట్ పడగొట్టారు.