గాలిలో కార్లు.. రోడ్లపై రోబోలు!
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసే అద్భుతాలను చైనాకు చెందిన ఎక్స్‌పెంగ్ సంస్థ(XPeng) వాస్తవం చేయబోతోంది. కేవలం ఎలక్ట్రిక్ కార్ల తయారీకే పరిమితం కాకుండా, ‘ఫ్లయింగ్ కార్లు’, ‘హ్యూమనాయిడ్ రోబోల’ రంగంలో 2027 నాటికి ప్రపంచం ఆశ్చర్యపోయే మార్పులు తీసుకురావాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్స్‌పెంగ్ ప్రెసిడెంట్ బ్రియన్ గు తాజా ప్రకటన ప్రకారం, తమ ప్రతిష్టాత్మక ఫ్లయింగ్ కార్ల డెలివరీలను 2027 నాటికి ప్రారంభించనున్నారు. రోడ్డుపై ప్రయాణించే కారు, దాని నుంచి విడిపోయి గాలిలో ఎగిరే ఎయిర్‌క్రాఫ్ట్‌తో కూడిన ‘మాడ్యులర్ వెహికల్’ను ఇప్పటికే కంపెనీ ప్రదర్శించింది. ఈ ఫ్లయింగ్ కార్ల కోసం ఇప్పటికే 7,000లకు పైగా ఆర్డర్లు వచ్చాయి. గ్వాంగ్జౌ లో ఏర్పాటు చేసిన ప్లాంట్ ద్వారా ఏటా 10,000 యూనిట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో పాటు ‘ఐరన్’ హ్యూమనాయిడ్ రోబోను కూడా త్వరలోనే అభివృద్ధి చేయనున్నారు. రోబోటిక్స్ రంగంలో ఎక్స్‌పెంగ్ అభివృద్ధి చేసిన IRON అనే హ్యూమనాయిడ్ రోబో మాస్ ప్రొడక్షన్ గా 2026 చివరి నాటికి రోబోల భారీ ఉత్పత్తిని ప్రారంభించి, 2027 నాటికి వీటిని పారిశ్రామిక, ఇతర భౌతిక పనుల కోసం మార్కెట్లోకి తీసుకురానున్నారు. మనుషుల తరహాలోనే కదలికలు కలిగిన ఈ రోబోలు, ఫ్యాక్టరీల్లో క్లిష్టమైన పనులను కూడా సులభతరం చేయనున్నాయి.

