Home Page SliderNationalNews AlertSports

ముకేశ్‌కే ఈ విజయం అంకితం : రుతురాజ్ గైక్వాడ్

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) విశ్వరూపం ప్రదర్శించింది. వాంఖడే స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థి ముంబయి ఇండియన్స్‌ను 103 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి, లీగ్ చరిత్రలోనే తన అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అయితే, ఈ గెలుపు కేవలం పాయింట్ల పట్టిక కోసమే కాదు.. తమ సహచర ఆటగాడు ముకేశ్ చౌదరి పట్ల జట్టుకున్న నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యలు అందరినీ కదిలించాయి. ఈ చారిత్రాత్మక విజయాన్ని పేసర్ ముకేశ్ చౌదరికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. “ముకేశ్ తన తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. అంత్యక్రియలు ముగిసిన వెంటనే జట్టు కోసం తిరిగి రావడం అతడి మానసిక ధైర్యానికి నిదర్శనం. అతడి కోసమే ఈ మ్యాచ్ గెలవాలని మేం ముందే నిర్ణయించుకున్నాం.” అని పేర్కొన్నాడు. ముంబయి వంటి బలమైన జట్టును వారి సొంత గడ్డపైనే ఇంత భారీ తేడాతో ఓడించడం, సీఎస్‌కే తిరిగి ఫామ్‌లోకి వచ్చిందని చెప్పడానికి బలమైన సంకేతం. ముఖ్యంగా కష్టసమయంలో తోటి ఆటగాడికి అండగా నిలిచిన తీరు ఈ విజయానికి మరింత వన్నె తెచ్చింది.