Breaking Newshome page sliderHome Page SliderTelangana

కేసీఆర్ మొగోడు … తెలంగాణ తెచ్చిన మొనగాడు

కేసీఆర్ మొగోడు.. తెలంగాణ తెచ్చిన మొనగాడు. మా అయ్య పేరు బరాబర్ చెప్పుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు . వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని కొడంగల్‌లో ఎమ్మెల్యేగా గెలవకుండా చేసే బాధ్యత మాది అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి భాష విని తెలంగాణ ప్రజలంతా అసహ్యించుకుంటున్నాని అన్నారు. ఒక రోజు కాదు.. రెండ్రోజులు కాదు.. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లుగా కేసీఆర్‌ను తిడుతూనే ఉన్నారని అన్నారు. పరిపాలన పక్కనబెట్టి కేసీఆర్‌‌పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిని, నా తండ్రిని నువ్వు తిడుతుంటే ఒక కొడుకుగా నాకు ఆవేశం రాదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అసభ్యకర భాష చూస్తుంటే ఒక్కోసారి ఎడమకాలి చెప్పుతో కొట్టాలని పిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి సీటే రేవంత్ రెడ్డిని కాపాడుతోందని పరోక్షంగా హెచ్చరించారు.. పాలమూరు – రంగారెడ్డి డీపీఆర్‌ను వెనక్కి పంపితే ఏం చేస్తున్నావని కేసీఆర్ అడిగారు. దానికే మళ్లీ కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ హక్కులు కాపాడాలని చెబితే కూడా కోపం వస్తే.. వీళ్లేం పాలన చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. బ్యాగులు మోసి జైలుకెళ్లి.. పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి పాలన ఏం తెలుస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.