Breaking Newshome page sliderHome Page SliderNationalNewsTelanganaviral

కాళేశ్వరంపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారు

కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ప్రజల సొమ్ముతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా కేసును సీబీఐ కి అప్పగించారని మండిపడ్డారు. కాళేశ్వరం కూళేశ్వరం అని మాట్లాడిన వారే ఇప్పుడు అదే కాళేశ్వరం నీళ్లు తెచ్చి హైదరాబాద్ ప్రజలకు నీళ్ళు ఇస్తామని అంటున్నారంటే తెలంగాణకు కాళేశ్వరం కల్పతరువు అని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పినట్లు అయిందన్నారు. గండిపేటకు తీసుకువస్తున్నవి కాళేశ్వరం నీల్లా కాదా దీనికి సీఎం సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసినందుకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు కాళేశ్వరం నీళ్లతో వచ్చే కీర్తి కోసం ప్రయత్నం చేస్తూనే మరో వైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న విమర్శలు చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రజలను ఎంతలా మోసం చేస్తున్నారో తెలుస్తుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు . కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కాళేశ్వరంలో లక్ష కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి 94 వేల కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో ఓ వైపు నీళ్లు కనిపిస్తుంటే లక్ష కోట్ల అవినీతి ఎలా అవుతుండని కొట్టిపారేసిన సీఎం బుద్ధి మారడం లేదని కేటీఆర్ విమర్శించారు.