టోల్ గేట్ క్యాబిన్ లోకి దూసుకెళ్లిన లారీ..
తెలంగాణలోని జనగామ జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న కోమల్ల టోల్ గేట్ క్యాబిన్ లోకి లారీ దూసుకెళ్లింది. దీంతో అక్కడ ఉన్న టోల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయాలైనవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో టోల్ గేట్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

