Andhra PradeshHome Page SliderNewsPoliticsviral

చీపురు పట్టిన చంద్రబాబు, లోకేష్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేట, చీపురు చేతపట్టారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తణుకులో ప్రారంభించారు. తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మున్సిపల్ కార్మికులతో కలిసి ఎన్టీఆర్ పార్క్‌లో చెత్తను ఊడ్చిశుభ్రం చేశారు. ఇదే కార్యక్రమంలో భాగంగా మంత్రి నారా లోకేశ్ మంగళగిరి ఎకో పార్కులోని పరిసరాలను శుభ్రం చేశారు. పార్కులోని కార్మికులతో ముచ్చటించి, వారితో కలిసి చెత్త ఊడ్చారు. అనంతరం కార్మికుడిని సన్మానించారు. అలాగే పార్కుకు వచ్చిన సందర్శకులతో మాట్లాడి, వారి నుండి పలు సూచనలు స్వీకరించారు.