90 శాతం కొత్త పన్ను విధానంలోనే..
నయా బడ్జెట్ మధ్యతరగతి జీవుల జీవితాలను మార్చబోతోందని, ఇకపై దేశంలో 90 శాతం మందికి పైనే కొత్తపన్ను విధానంలోకి మారిపోతారని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ఛైర్మన్ రవి అగర్వాల్ పేర్కొన్నారు. ఈ కొత్త ఆదాయపు పన్ను విధానంలో రూ.12 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉండడంతో ఎలాంటి ఆర్థిక నిపుణులు, ఆడిటర్ల అవసరం లేకుండా సామాన్య ప్రజలు ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) దాఖలు చేసుకోవచ్చని వివరించారు. సాధారణ పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయం వెల్లడించేందుకు ఎక్కువగా కష్టపడకుండానే సులభంగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. తప్పుడు ఐటీఆర్‌లు దాఖలు చేసినా, ఐటీ శాఖ కృత్రిమ మేధను ఉపయోగించి, వివిధ రకాల డేటాను విశ్లేషించడం ద్వారా పన్ను చెల్లింపుదారుల పూర్తి సమాచారాన్ని సేకరిస్తోందని పేర్కొన్నారు.