Home Page SliderTelangana

తెలంగాణాలో కొత్తగా మరో 8  మెడికల్ కాలేజీలు

తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనుంది. కాగా గద్వాల, నారాయణ్‌పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి, రంగారెడ్డి , మేడ్చల్‌లో కొత్త మెడికల్ కాలేజీలను నిర్మించనుంది. తెలంగాణాలో కేసీఆర్ సర్కార్ 9 ఏళ్ల పాలనలో  రాష్ట్రంలో మొత్తం 29 కాలేజీలను ఏర్పాటు చేశారు. దీంతో దేశంలోనే జిల్లాకో మెడికల్ కాలేజీ కలిగిన రాష్ట్రంగా తెలంగాణా నిలిచింది. అంతేకాకుండా తెలంగాణాలో మొత్తం మెడికల్ సీట్ల సంఖ్య 10 వేలకు చేరువ కానుంది.