Home Page SliderNational

ఈడీ అధికారాలకు హద్దులుండాల్సిందే-సుప్రీంలో వాదనలు

Share with

ఈడీ అధికారులు, అధికార దుర్వినియోగాలకు పాల్పడుతున్నారని, వారి అధికారాలకు హద్దులు నిర్ణయించాల్సిందేనని ఒక సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టులో వ్యాఖ్యానించారు. అదుపులేని అధికారాలతో మనీ లాండరింగ్ కేసుల దర్యాప్తు విషయంలో అధికారుల చర్యల వలన ప్రజలకు భద్రత కరువవుతోందని ఆయన పేర్కొన్నారు. గురుగ్రామ్‌కు చెందిన MIM కంపెనీ మనీలాండరింగ్ కేసు బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కంపెనీ తరపున న్యాయవాది సాల్వే ఈ రకంగా ఈడీ అధికారాలపై వ్యాఖ్యానించారు. భారత్‌లో ఈడీ అధికారులు అసాధారణ అధికారాలు కలిగి ఉన్నారని, వాటికి అదుపు లేకపోతే ప్రజలకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఈ కేసులో విచారణకు సహకరించిన వారిని కూడా అరెస్టు చేసి పరువు తీసారని, వారు ముందస్తు బెయిల్ షరతులు ఉల్లంఘించినట్లు ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ కేసులో డైరక్టర్లు బసంత్ బన్సార్, పంకజ్ బన్సాల్‌ల ఇళ్లలో సోదాలు జరిపిన ఈడీ, కోర్టు వారికి మధ్యంతర బెయిల్ ఇచ్చినా కూడా వారిని అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల కస్టడీ విధించారు. ఈ కస్టడీని సవాలు చేస్తూ వారు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ కేసు తీసుకోకపోగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు వారికి ముందస్తు బెయిల్ కోసం పంజాబ్ హరియాణా కోర్టుకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది.