2 బెడ్ రూమ్ ఇళ్లు మొత్తం.. సమస్యల మయం..!
ఖమ్మం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని మల్లెమడుగు గ్రామంలో రెండు పడక గదుల ఇళ్ల సముదాయం సమస్యల మయంగా మారింది. సమీపంలోని డంపింగ్ యార్డు చెత్తాచెదారంతో నిండిపోవడంతో దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు నిలిచిపోవడంతో తాగునీటికి అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. దాదాపు 18 కి.మీ. దూరంలో ఉన్న అగ్రహారం నుండి ఇక్కడికి వచ్చామని, ఇళ్లపట్టాలు ఇచ్చిన కొద్దిరోజులకే తిరిగి తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని వేడుకుంటున్నారు.