టీమిండియాలోకి యశస్వి సోదరుడు
టీమిండియా స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ సోదరుడు తేజస్వీ జైస్వాల్ కూడా తాజాగా టీమిండియాలో స్థానం సంపాదించారు. అన్నదమ్ములిద్దరికీ క్రికెట్‌పై ఆసక్తి ఉన్నా కూడా గతంలో యశస్వీ జైస్వాల్ కోసం త్యాగం చేసి, తేజస్వి ఢిల్లీలోని ఒక దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేశారు. అయితే ఇప్పుడు యశస్వి అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక స్థానం సంపాదించాక, అతని అన్న తేజస్వి తన కలలు నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో క్రికెట్ వైపు అడుగులు వేశారు. త్రిపుర తరపున బరోడాలో జరిగిన మ్యాచ్‌లో తేజస్వీ 87 పరుగులు సాధించారు. దీనితో టీమిండియాకు సెలక్ట్ అయ్యారు. క్రికెట్ అభిమానులు అన్నదమ్ములిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.